రెండు సంవత్సరాలు నాలుగు గోడలు మధ్య బతికి, ఒక్కసారిగా ప్రంపంచ వింతలూ అన్ని చూసినట్టు ఉంది ......
కొత్త రాష్ట్రం, కొత్త భాష, కొత్తపద్దతులు , వీటి అన్నిటి మధ్య తెలుగు శబ్ధం వినిపిస్తే, హే!మనవాళ్లే అనే ఒక సంతృప్తి .......
ఈ రంగులలోకం వెనుక ఒక చీకటి కాలం దాగి ఉన్నది అని తెలుసుకోవటానికి కొంత సమయం పట్టింది.....
ఒక దోస తింటే అరవై రూపాయాలు ఖర్చుఅవుతుంది అని పన్నెండు రూపాయలు టీ తాగి కడుపు నింపుకుని
ఎంత ఆకలి వేసిన డబ్బులు ఖర్చుఅవుతాయ్ అని ఒక కాఫీ తాగి కళ్ళు మూసుకొని దుప్పటి కప్పుకున్న రోజులు ఎన్నో ......
ఆరోజుల్లో నాన్న జెబ్బులో , వంటగది పోపులడబ్బా లో నుండి తీసుకున్న రూపాయిని ,
ఈరోజు దాయటానికి కొన్ని వందల కష్టాలన్ని , వేల త్యాగాలని చేయవలసి వస్తుంది..............
అమ్మనాన్న ని వెనుక సీట్ లో కూర్చోపెట్టి, నేను డ్రైవింగ్ చేస్తా..అన్న కళలు కల్లలు గానే మిగిలిపోతాయి ఏమో అని భయంవేస్తుంది......
విష్ణుమూర్తికి దశావతారాలు ఉన్నట్టే, ప్రతి మనిషిలోను కొన్నిముఖాలు ఉంటాయి.
కోట్లా జనాభా ఉన్న దేశం లో ఎవరు మంచి, ఎవరు మాట్లాడేది నిజం, ఎవర్ని నమ్మాలి, ఎవరితో స్నేహం చేయాలి .....అనేవి అంతుచిక్కని ప్రశ్నలు
నాలుగు గోడల మధ్య ఉన్నప్పుడు ఎవరైనా తోడు ఉంటే బాగుండు అనిపించేది ,
ఇప్పుడు నా చుట్టూ ఇంత మంది ఉన్నా, ఒంటరితనం మేలు అనిపిస్తుంది .......
English Translation:
After living between four walls for two years, it is like seeing all the wonders of the world at once...
New state, new language, new culture...
It took some time to realize that behind this colorful world lies a dark age….
There are many days of just drinking a cup of coffee, closing your eyes and covering yourself with a blanket with a hungry stomach.................
In those days, the rupee taken from my father's pocket and the mommy's purse
These days, hundreds of hardships and thousands of sacrifices have to be made to save that rupee....
It scares me that the art of driving with my mother sitting in the back seat will be nothing but rubbish.
Just as Lord Vishnu has Dasavataras, every human being has several faces.
In a country with a population of crores, who is good, who speaks the truth, who should be trusted, who should be friends is a millionaire dollar question
It feels good to have someone with you when you are between four walls.
Now with so many people around me, loneliness feels good.
No comments:
Post a Comment